: బాంబు పేలుళ్లలో గాయపడ్డవారిలో ఆరుగురి పరిస్థితి విషమం


హైదరాబాద్ జంట బాంబు పేలుళ్ల ఘటనలో గాయపడి  చికిత్స పొందుతున్న వారిలో ఆరుగురి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. తమ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 10 మందిలో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఒమ్నీ ఆసుప్రతి వైద్యులు  తెలిపారు.

పేలుళ్ల ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న వారి
 ఆరోగ్య స్థితిపై ఓమ్నీ ఆసుపత్రి ఆదివారం తాజా బులెటిన్ ను విడుదల చేసింది. మరోవైపు తమ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 23 మందిలో ముగ్గురి పరిస్థితి విషమంగా వుందని నాంపల్లి కేర్ ఆసుపత్రి  వైద్యులు వెల్లడించారు. దీంతో వీరి ఆరోగ్యంపై బాధితుల కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి.

  • Loading...

More Telugu News