: రెండు ప్రాంతాల నేతలతో చర్చించి ఉంటే ఇలా జరిగేది కాదు: పాలడుగు
విభజన ప్రకటనకు ముందే తెలంగాణ, సీమాంధ్ర ప్రాంత నేతలతో సంప్రదింపులు జరిపి సమస్యలు పరిష్కరించి ఉంటే ఈ పరిస్థితి దాపురించి ఉండేది కాదని కాంగ్రెస్ సీనియర్ నేత పాలడుగు వెంకట్రావు అన్నారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని డిమాండ్ చేశారు. సీమాంధ్ర ప్రజలంతా అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇలా చేయడం ఎంతమాత్రం తప్పుకాదన్నారు. ఇప్పటికైనా ఇరు ప్రాంత నేతలతో చర్చించిన అనంతరమే తెలంగాణ ప్రక్రియ ప్రారంభించే విషయమై నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.