: లోపాలు సమీక్షించుకుని మళ్ళీ ప్రయోగానికి సిద్ధమవుతాం: ఇస్రో చైర్మన్


జీఎస్ఎల్వీ-డీ5 రాకెట్ ప్రయోగం వాయిదా పడడం పట్ల ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ వివరణ ఇచ్చారు. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కౌంట్ డౌన్ సాగుతుండగా, కొన్ని నిమిషాల క్రితమే సాంకేతిక లోపాలను గుర్తించామని తెలిపారు. పరిశీలించగా, ఇంధన విభాగంలో కొన్ని లోపాలు కనిపించాయని వెల్లడించారు. లోపాలను పూర్తిస్థాయిలో సమీక్షించుకుని మళ్ళీ ప్రయోగానికి సిద్ధమవుతామని ఆయన పేర్కొన్నారు. ఈ జీఎస్ఎల్వీ -డీ5 రాకెట్ ద్వారా అత్యాధునిక కమ్యూనికేషన్ ఉపగ్రహం జీశాట్-14ను ఈ సాయంత్రం 4.50 గంటలకు రోదసీలోకి ప్రయోగించాల్సి ఉంది. అయితే, క్రయోజెనిక్ ఇంజిన్లో ఆయిల్ లీకేజిని గుర్తించిన శాస్త్రవేత్తలు ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.

  • Loading...

More Telugu News