: రాష్ట్ర విభజనపై సీమాంధ్ర మంత్రుల నిర్ణయం మారలేదు: కావూరి


రాష్ట్ర విభజన నిర్ణయంపై అధిష్ఠానం వైఖరిలో మార్పు తేవాలన్న లక్ష్యాన్ని సీమాంధ్ర మంత్రులు మార్చుకోలేదని కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు చెప్పారు. రాష్ట్రం కలిసుంటే వచ్చే శాస్త్రీయ లాభాలు.. విడిపోతే వచ్చే నష్టాలను రేపు ఆంటోనీ కమిటీ ముందు వివరిస్తామన్నారు. తెలంగాణ ప్రకటనతో హైదరాబాదు తమది కాదన్న భావనను సీమాంధ్ర ప్రజలు తట్టుకోలేకపోతున్నారని కావూరి అన్నారు. కాబట్టి, హైదరాబాదుపై అందరికీ హక్కులు కల్పించి విభజన చేయాలని కమిటీకి చెబుతామన్నారు. తెలంగాణ, సీమాంధ్రలకు వేర్వేరు రాజధానులు ఏర్పాటుచేసి విభజన చేయాలని కావూరి అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News