: జగన్ పార్టీకి గుడ్ బై చెప్పిన టీవీ ప్రెజెంటర్
న్యూస్ ప్రెజెంటర్ గా ఎలక్ట్రానిక్ మీడియాలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుని ఆనక రాజకీయాల్లోకి అడుగిడిన రాణీరుద్రమ వైఎస్సార్సీపీకి గుడ్ బై చెప్పింది. వార్తా రంగంలో కెరీర్ ఉచ్ఛస్థితిలో ఉన్నప్పుడు జగన్ పార్టీలో చేరి వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ ఇన్ చార్జ్ గా నియమితురాలైన రుద్రమ తాజా పరిణామాల నేపథ్యంలో పార్టీని వీడింది. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ విజయమ్మ దీక్ష చేపట్టడంతో రుద్రమ ఈ నిర్ణయం తీసుకుంది.