: విచారణలో ఉగ్రవాది తుండా వెల్లడించిన నిజాలు
లష్కరే తోయిబా ఉగ్రవాది, బాంబుల తయారీ నిపుణుడు అబ్దుల్ కరీం తుండా విచారణలో కీలక నిజాలు బయటపెట్టాడు. తనను పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ 'ఐఎస్ఐ' భారత్ లోకి నకిలీ కరెన్సీ సరఫరాకు వాడుకుంటున్నట్లు తుండా వెల్లడించాడు. 2005 నుంచి నకిలీ కరెన్సీ స్మగ్లింగ్ చేస్తున్నట్లు తుండా అంగీకరించాడు. తనకీ బాధ్యతలు అప్పగించిన ఐఎస్ఐలోని ఇద్దరు మేజర్లు, మరికొందరు బ్రిగేడియర్ల పేర్లను కూడా చెప్పాడు.
తుండాను శనివారం ఢిల్లీ పోలీసులు నేపాల్ సరిహద్దుల్లో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఢిల్లీ కోర్టు అనుమతితో తమ కస్టడీలోకి తీసుకుని అతడిని ప్రశ్నిస్తున్నారు. ముంబై మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం పాక్ లో లేడని ఆ దేశం చెబుతున్నదంతా పచ్చి అబద్ధమని తుండా మాటలను బట్టి వెల్లడైంది. దావూద్ ను తాను కరాచీలో చాలా సార్లు కలిశానని తుండా విచారణలో పోలీసులకు తెలిపాడు.