: ఎంసెట్ కౌన్సెలింగ్ పై హైకోర్టులో పిటిషన్
సీమాంధ్రలోని 23 ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ కేంద్రాల్లో కౌన్సెలింగ్ ప్రక్రియ సక్రమంగా జరగడం లేదని హైకోర్టులో విద్యార్థులు పిటిషన్ వేశారు. ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాల్లో కౌన్సెలింగ్ సరిగా జరగట్లేదని విద్యార్ధులు వేసిన పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. దీనిపై ఎల్లుండిలోగా సమాధానం ఇవ్వాలని డీజీపీ, రాయసీమ, ఆంధ్రాప్రాంత ఐజీలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.