: జీహెచ్ఎంసీ లో బైఠాయించిన ఎమ్మెల్సీ నాగేశ్వర్
హైదరాబాద్, సికింద్రాబాద్ లో పార్కుల కబ్జాలను అడ్డుకోవాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్సీ నాగేశ్వర్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వద్ద బైఠాయించారు. జీహెచ్ఎంసీలో జరుగుతున్న ప్రజావాణి కార్యక్రమంలో ఎమ్మెల్సీ నాగేశ్వర్ జంటనగరాల్లో కబ్జాకోరులు రాజ్యమేలుతున్నారని, పార్కులను యధేచ్ఛగా కబ్జా చేస్తుంటే ప్రభుత్వాధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. తక్షణం పార్కులపై పూర్తి సమాచారం అందించేవరకు తాను కదిలేది లేదంటూ అక్కడే బైఠాయించారు. అధికారులు వచ్చి సమాధానం చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు.