: బొగ్గు స్కాంపై రాజ్యసభలో రగడ.. ప్రధాని ప్రకటనకు బీజేపీ పట్టు
సంచలనం సృష్టించిన బొగ్గు కుంభకోణంపై సోమవారం మొదలైన రాజ్యసభ సమావేశాల్లో రగడ నెలకొంది. నిబంధనలను పక్కనబెట్టి పలు ప్రయివేటు కంపెనీలకు లైసెన్సుల కేటాయింపుకు సంబంధించిన ఫైళ్లు కనిపించడం లేదని బొగ్గుశాఖ మంత్రి శ్రీ ప్రకాశ్ జైస్వాల్ గతవారం తెలిపారు. ఈరోజు సభలో ఈ అంశాన్ని లేవనెత్తిన బీజేపీ ఎంపీ ధర్మేంద్ర ప్రధాన్.. కోల్ స్కాంకు సంబంధం ఉన్న ఫైళ్లు కనిపించకుండాపోవడం అవమానకరమన్నారు. దీనిపై పార్లమెంటులో ప్రధాని తప్పకుండా సమాధానం చెప్పాలన్నారు. ఇందుకు మిగతా సభ్యులు కూడా వంత పాడటంతో బీజేపీ ఎంపీ పట్టుబట్టారు. ప్రధాని కార్యాలయం కూడా వివరణ ఇవ్వాలని డిమాండు చేశారు. ఇప్పటికే ఈ స్కాంపై సీబీఐ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే.