: షిప్ యార్డ్ కు సమైక్య సెగ
విశాఖ షిప్ యార్డుకు సమైక్యాంధ్ర సెగ తగిలింది. సెంట్రల్ గవర్నమెంటు సంస్థైన షిప్ యార్డులో ప్రైవేటు కార్మికులు రాష్ట్రాన్ని ముక్కలు చేయొద్దంటూ సమ్మె చేపట్టారు. దీంతో షిప్ యార్డులో పనులన్నీ నిలిచిపోయాయి. షిప్ యార్డులోని ప్రవేటు కాంట్రాక్టర్లు, సబ్ కాంట్రాక్టర్లే మరమ్మత్తు పనులన్నీ నిర్వహిస్తారు. వీరు చేసే పనులను ప్రభుత్వోద్యోగులు పర్యవేక్షిస్తారు. ప్రభుత్వ షిప్ నిర్మాణ పనులను షిప్ యార్డు ఉద్యోగులు నిర్వహిస్తుంటారు. ప్రైవేటు కార్మికులు సమ్మెకు దిగడంతో జెట్టీల మీద షిప్పుల మరమ్మత్తు పనులన్నీ నిలిచిపోయాయి.