: ఏడేళ్ల బాలిక సజీవ దహనం
అగ్ని ప్రమాదంలో ఏడేళ్ల బాలిక సజీవదహనమైన ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం వాండ్రం గ్రామంలో జరిగింది. ముప్పిడి దేవరాజు కుటుంబం ఇంట్లో నిద్రిస్తుండగా అర్థరాత్రి ఒక్కసారిగా మంటలు చుట్టుముట్టాయి. దీంతో మువ్వా పూజ(7) మంటల్లో చిక్కుకుని సజీవదహనమైంది. బాలికను కాపాడేందుకు ప్రయత్నించిన ఆమె తాతయ్య ముప్పిడి దేవరాజు తీవ్రంగా గాయపడ్డారు. బాలిక తల్లి మరియమ్మ, సోదరుడు సమాధానం ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఉండి ఎమ్మెల్యే వి.శివరామరాజు, మాజీ ఎమ్మెల్యే సర్రాజు తదితరులు బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించారు.