: 300 జేసీబీలతో సమైక్యర్యాలీ
సమైక్యాంధ్రకు మద్దతుగా ఒక్కో జిల్లాలో ఒక్కోరకంగా సమైక్యవాదులు కదం తొక్కుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో సమైక్యాంధ్రకు మద్దతుగా ఆందోళనలు ఉద్ధృతంగా సాగుతున్నాయి. రావులపాలెం వద్ద జాతీయ రహదారిపై 300 జేసీబీలతో భారీ ర్యాలీ నిర్వహించి నినాదాలు చేశారు. దీంతో జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. సమైక్యమే తమ నినాదమని, రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి తాము ఒప్పుకోబోమని వారు నిరసన తెలిపారు.