: కరెన్సీ నోట్లపై 'కాశ్మీర్ వేర్పాటు' నినాదాలు
జమ్మూకాశ్మీర్లో మళ్లీ వేర్పాటువాదులు చెలరేగిపోతున్నారు. భారత కరెన్సీ నోట్లపై వేర్పాటువాద నినాదాలు రాసి వ్యాప్తి చేస్తున్నారు. దీనికి సంబంధించి ఒక వేర్పాటువాద సంస్థ యూట్యూబ్ లో వీడియో కూడా పెట్టింది. గత నాలుగు నెలల కాలంలో మొత్తం 30 కోట్ల రూపాయల విలువైన కరెన్సీ నోట్లపై ఈ రాతలు రాసినట్లు ఆ సంస్థ ఫేస్ బుక్ లో పేర్కొంది. రిజర్వ్ బ్యాంకు నిబంధనల ప్రకారం నోట్లపై రాతలు రాస్తే అవి ఇక చెల్లవు. దీనిపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.