: సీమాంధ్రలో ఎంసెట్ కౌన్సెలింగ్ కు బ్రేక్
రాష్ట్ర విభజన సెగ ఎంసెట్ కౌన్సెలింగ్ ను తాకింది. ఈ ఉదయం పది గంటలకు సీమాంధ్రలోని 13 జిల్లాల్లో 34 కేంద్రాల్లో ఎంసెట్ కౌన్సెలింగ్ మొదలైంది. అయితే, సిబ్బంది విధుల బహిష్కరణతో పలుచోట్ల కౌన్సెలింగ్ నిలిచిపోయింది. పశ్చిమగోదావరి జిల్లాలోని తణుకులో సమైక్యవాదులు కౌన్సెలింగును అడ్డుకున్నారు. అటు శ్రీకాకుళం జిల్లాలోని పాలిటెక్నిక్ కళాశాలలో కౌన్సెలింగ్ కు సమైక్యవాదులు అడ్డుతగిలారు. కాగా, నెల్లూరులోని వెంకటేశ్వరపురం ప్రభుత్వ బాలుర పాలిటెక్నిక్ కళాశాలలో మొదలైన కౌన్సెలింగ్ ను విద్యార్ధి జేఏసీ నాయకులు అడ్డుకున్నారు. దాంతో, పోలీసులు కౌన్సెలింగ్ కేంద్రం వద్దకు చేరుకుని ఆందోళనకారులను అరెస్టు చేశారు.