: ఎబోలాను అరికట్టవచ్చు


ఎబోలా జ్వరం ప్రాణాంతకమైన జ్వరం. ప్రపంచంలోనే ఇది ప్రాణాంతకమైన జ్వరంగా శాస్త్రవేత్తలు చెబుతారు. ఈ జ్వరానికి విరుగుడు కనిపెట్టే దిశగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ జ్వరానికి కారకమైన వైరస్‌ గుట్టును శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇక ఈ వైరస్‌ను అరికట్టేందుకు అనువైన ఔషధాలను అన్వేషించడంలో శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగిస్తున్నారు.

క్యాన్సర్‌, ఎయిడ్స్‌ వంటి వ్యాధుల్లాగా ప్రపంచాన్ని వణికించే జ్వరం ఎబోలా జ్వరం. ఎబోలా వైరస్‌ సోకిన మనుషులు, జంతువుల జీవద్రవాలు అనగా రక్తం, వీర్యం వంటి వాటినుండి ఈ జ్వరం ఇతరులకు వ్యాపిస్తుంది. ఈ వైరస్‌ సోకిన వారికి అతివేగంగా జ్వరం పెరుగుతుంది. నాళాలు దెబ్బతినడానికి కారణమై, వ్యక్తిని తీవ్రమైన షాక్‌కు గురిచేసి చివరికి మరణానికి దారితీస్తుంది. ఈ ఎబోలా వైరస్‌ సోకిన వ్యక్తి బ్రతికే అవకాశాలు చాలా తక్కువే. ఈ వ్యాధి సోకిన తర్వాత మరణాల రేటు మాత్రం 90 శాతం వరకూ ఉంటుందని అంచనా. ది స్క్రిప్స్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లోని ఇమ్యూనాలజీ అండ్‌ మైక్రోబియల్‌ సైన్స్‌ శాఖకు చెందిన ఓల్‌మాన్‌ సఫైర్‌ అనే శాస్త్రవేత్త ఓబోలా వైరస్‌లోని వీపీ40’ అనే ప్రోటీన్‌ అణువ్యవస్థను పసిగట్టారు. ఈ ప్రోటీన్‌ కొత్త వైరస్‌లను ఎలా ప్రతులుగా సృష్టిస్తుందో తెలుసుకున్నారు. ఈ ప్రతుల క్రమాన్ని ఆపగలిగే ఔషధాలను ఆవిష్కరిస్తే ఈ వ్యాధిని సమర్ధవంతంగా అరికట్టవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News