: మా ప్రాంతానికి వచ్చి రెచ్చగొట్టే వ్యాఖ్యలా?: గంటా


వీహెచ్ నిన్న తిరుమలలో చేసిన వ్యాఖ్యల పట్ల మంత్రి గంటా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ నేతలు తమ ప్రాంతానికి వచ్చి రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం తగదని హితవు పలికారు. సీమాంధ్ర ఉద్యమాన్ని వీహెచ్ పెట్టుబడిదారుల ఉద్యమంగా అభివర్ణించడాన్ని గంటా తప్పుబట్టారు. హైదరాబాదులో నేడు మీడియాతో మాట్లాడుతూ, ఇది ప్రజలు స్వచ్ఛందంగా నడిపిస్తున్న ఉద్యమం అని స్పష్టం చేశారు. ఇక ఎవరిపై దాడి జరిగినా ఖండించాల్సిందేనని చెప్పిన మంత్రి, వీహెచ్ పై దాడినీ అదే దృష్టితో చూస్తామని పేర్కొన్నారు. ఇలాంటి దాడులను ప్రోత్సహించకూడదని అన్నారు. అయితే, గతంలో పరకాల ప్రభాకర్ పైనా, ఇతర సీమాంధ్ర నేతలపైనా తెలంగాణ వాదులు దాడి చేయడాన్ని మర్చిపోవద్దని సూచించారు.

  • Loading...

More Telugu News