: రాహుల్ మెదక్ నుంచి పోటీ చేస్తారా.. ?


వైఎస్సార్సీపీ నేత మైసూరారెడ్డి విచిత్రమైన వాదనను తెరపైకి తెచ్చారు. వచ్చే ఎన్నికల్లో సొంత నియోజకవర్గంలో రాహుల్ గాంధీ గెలవడలేడని సోనియా నిశ్చయించుకుందంటున్నారు. అందుకే రాహుల్ ను మెదక్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయించేందుకు పావులు కదుపుతోందని పేర్కొన్నారు. కడప జిల్లా రైల్వే కోడూరులో వైఎస్సార్సీపీ నేత కొరముట్ల శ్రీరాములు సమైక్యాంధ్రకు మద్దతుగా దీక్ష చేపట్టగా, మైసూరా అందుకు సంఘీభావం తెలిపేందుకు ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, కేవలం పది సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజించిన ఘనత సోనియా సొంతమని ఎద్దేవా చేశారు. సమైక్యాంధ్ర ప్రకటన వచ్చే వరకు వైఎస్సార్సీపీ పోరాటం ఆగదన్నారు.

  • Loading...

More Telugu News