: సర్కారుకు సరైన సమాధానం చెబుతాం: ఏపీఎన్జీవో
ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తే సర్కారుకు సరైన సమాధానం చెబుతామని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు హెచ్చరించారు. హైదరాబాదులోని ఏపీఎన్జీవో కార్యాలయంలో నేడు మీడియాతో మాట్లాడుతూ, తమను అణచివేసేందుకు యత్నిస్తే మరింత ఉద్యమిస్తామని తెలిపారు. ఉద్యమం నడిపేందుకు తమకు నాయకత్వ కొరతలేదని అన్నారు. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలోనే ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. ఇక, ఉద్యోగులు, రవాణా సమ్మె కారణంగా విద్యార్థులు ఇబ్బందులెదుర్కొంటారని, అందుకే ఎంసెట్ కౌన్సెలింగ్ వాయిదా వేయాలని ప్రభుత్వానికి సూచించారు.