: సెంచరీ బాదిన రోహిత్ శర్మ


ప్రతిభకు లోటులేని యువ క్రికెటర్ రోహిత్ శర్మ మరోసారి బ్యాట్ కు పనిచెప్పాడు. రస్టెన్ బర్గ్ లో దక్షిణాఫ్రికా-ఎ జట్టుతో జరుగుతున్న నాలుగురోజుల అనధికార టెస్టు మ్యాచ్ లో రోహిత్ శతక బాదాడు. నాలుగోస్థానంలో వచ్చిన రోహిత్ శర్మ 119 పరుగులు చేసి డుమినీ బౌలింగ్ లో వెనుదిరిగాడు. అంతకుముందు కెప్టెన్ ఛటేశ్వర్ పుజారా (137) కూడా సెంచరీ నమోదు చేసిన సంగతి తెలిసిందే. వీరిద్దరి శతకాలతో భారత్-ఎ తొలి ఇన్నింగ్స్ లో భారీ స్కోరు సాధించింది. సురేశ్ రైనా (81 బ్యాటింగ్) కూడా రాణించడంతో యువజట్టు 4 వికెట్ల నష్టానికి 407 పరుగులతో ఆడుతోంది. ఆటకు నేడు రెండో రోజు కాగా, కాసేపట్లో భారత్-ఎ తన ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసే అవకాశముంది.

  • Loading...

More Telugu News