: ఇలాంటి దాడులతో సమస్య పరిష్కారం కాదు: మంత్రి శ్రీధర్ బాబు
తిరుపతిలో నిన్న రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావుపై సమైక్యవాదులు చెప్పులతో దాడి చేయడాన్ని మంత్రి శ్రీధర్ బాబు తీవ్రంగా ఖండించారు. హైదరాబాదులో ఈ మధ్యాహ్నం మీడియాతో మాట్లాడుతూ, ఇలాంటి దాడులతో సమస్య పరిష్కారం కాదని హితవు పలికారు. పైగా, సమస్య మరింత జటిలమవుతుందని అభిప్రాయపడ్డారు. ఏదేమైనా అధిష్ఠానం తీసుకున్న రాష్ట్ర విభజన నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలని శ్రీధర్ బాబు సూచించారు.