: చిరంజీవిలాంటి వ్యక్తి రాజకీయాలకు అన్ ఫిట్: రోజా
కేంద్ర మంత్రి చిరంజీవితో ఇంతకుముందు పలు సినిమాలు చేసిన అందాలతార రోజా ఓ ఇంటర్వ్యూలో పలు విషయాలు పంచుకుంది. చిరంజీవిలాంటి సున్నిత మనస్కుడు రాజకీయాలకు పనికిరాడని స్పష్టం చేసింది. ఏ విషయమైనా తేలిగ్గా తీసుకొనగలిగితేనే రాజకీయాల్లో ఇమడగలమని పేర్కొంది. పలు విషయాల్లో పార్టీ పరంగా చిరంజీవిపై విమర్శలు చేశానని, వాటిని దృష్టిలో పెట్టుకుని ఏ కార్యక్రమంలో కలిసినా సీరియస్ గా ఫేస్ పెడతారని రోజా వివరించింది. ఆయన అలా ఉన్నప్పుడు తానూ సీరియస్ గానే ఉంటానని, మాట్లాడనని తెలిపింది. ఇంతకుముందు పెక్కు సందర్భాల్లో చిరంజీవి రాజకీయాలకు పనికిరాడన్న విషయాన్ని చెప్పానని రోజా వెల్లడించింది.