: టీడీపీ శాంతి ర్యాలీని అడ్డుకోవడంపై యనమల మండిపాటు
హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ జంట బాంబు పేలుళ్లకు నిరసన తెలుపుతూ టీడీపీ చేపట్టిన శాంతి ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా ఆయన భద్రత దృష్ట్యా గోషామహల్ దగ్గర టీడీపీ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. అలాగే ర్యాలీలో పాల్గొన్న టీడీపీ నేతలు తీగల కృష్ణా రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ లతో పాటు పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై స్పందించిన ఆ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు పోలీసుల వైఖరిపై మండిపడ్డారు. శాంతి భద్రతలను పరిరక్షించలేని పోలీసులు..శాంతి ర్యాలీని అడ్డుకోవడం తగదని ఆయన అన్నారు.