: వీహెచ్ ను తక్షణమే అరెస్టు చేయాలి: టీడీపీ ఎంపీ


రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు నిన్న తిరుపతిలో వ్యవహరించిన తీరుకు నిరసనగానే ఆయనపై సమైక్యవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారని టీడీపీ ఎంపీ శివప్రసాద్ వ్యాఖ్యానించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు సరిలేవని, అందుకే, సమైక్యవాదులు దాడి చేశారని ఆయన తెలిపారు. తక్షణమే వీహెచ్ ను అరెస్టు చేయాలని శివప్రసాద్ తిరుపతిలో ఈ మధ్యాహ్నం డిమాండ్ చేశారు. కాగా, వీహెచ్ ను అరెస్టు చేయాలంటూ తిరుపతి అర్బన్ ఎస్పీ కార్యాలయం ఎదుట ఎస్వీయూ విద్యార్థి జేఏసీ ధర్నా చేస్తోంది.

  • Loading...

More Telugu News