: టీ20 క్రికెట్లో మూడు బంతుల్లో హీరో అవ్వొచ్చు: సచిన్
టీ20 క్రికెట్ లో స్టార్ అయిపోవడం పెద్ద కష్టం కాదంటున్నాడు బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్. బెంగళూరులో జరిగిన కర్ణాటక క్రికెట్ సంఘం ప్లాటినం జూబ్లీ వేడుకల్లో పాల్గొన్న సచిన్ క్రికెట్ పై తన అభిప్రాయాలు వెల్లడించాడు. మూడు నాలుగు బంతుల్లో హీరో అయిపోవాలనుకుంటే అది ఈ మినీ ఫార్మాట్లో మాత్రమే సాధ్యమన్నాడు. బ్యాట్ ను బలంగా ఊపగలిగితే చాలంటూ, ప్రాథమిక సూత్రాలతో పనిలేని ఫార్మాట్ ఇదేనన్నాడు. టెస్టుల్లో అయితే ప్రాథమిక అంశాలను విస్మరిస్తే, ఫలితాలు ప్రతికూలంగా ఉంటాయని తెలిపాడు. ఏదేమైనా.. టీ20 క్రికెట్ కారణంగా టెస్టుల్లోనూ ఉత్సుకత పెరిగిందని వివరించాడు.