: తిరుమల పవిత్రతకు వీహెచ్ భంగం కలిగించారు: చెవిరెడ్డి
తిరుమల పవిత్రతకు భంగం కలిగేలా వ్యవహరించిన రాజ్యసభ సభ్యుడు వీ హనుమంతరావుపై కేసు నమోదు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుమలలో ఎలాంటి రాజకీయ అంశాలు మాట్లాడరాదన్న టీటీడీ నిబంధనను వీహెచ్ ఉల్లంఘించారని అన్నారు. కనుక వీహెచ్ పై కేసు నమోదు చేయాలని కోరారు. రాష్ట్ర విభజన తర్వాత సీమాంధ్ర ప్రాంత ఉద్యోగులు తెలంగాణ విడిచి వెళ్లిపోవాలని, అక్కడే ఉండేట్లయితే ఉద్యోగాలకు రాజీనామా చేయాల్సి ఉంటుందని వీహెచ్ నిన్న తిరుమలలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.