: చిరంజీవీ.. నువ్వో బచ్చా: అసదుద్దీన్ ఓవైసీ


హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించి, రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా చేయాలన్న కేంద్ర మంత్రి చిరంజీవి వ్యాఖ్యలపై మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా మండిపడ్డారు. హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తే ఎన్నడూ చూడని ఉద్యమాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని అసదుద్దీన్ హెచ్చరించారు. 'హైదరాబాద్ మనది, హైదరాబాద్ అందరిది' అని వ్యాఖ్యానించారు. సొంత పార్టీని నడుపుకోవడం చేతగాక కాంగ్రెస్ లో కలిపేసిన చిరంజీవి ఇలాంటి సలహాలు ఇవ్వడం మానుకోవాలని సూచించారు. 'చిరంజీవి నువ్వు బచ్చావు' అంటూ అసదుద్దీన్ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News