: ముగిసిన సీమాంధ్ర మంత్రుల సమావేశం
సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో ఈ సాయంత్రం ఆయన క్యాంపు కార్యాలయంలో సీమాంధ్ర మంత్రులు భేటీ అయ్యారు. కొద్దిసేపటి క్రితం ఈ సమావేశం ముగిసింది.ఆంటోని కమిటీ ఎదుట వినిపించాల్సిన వాదనలపై వారు చర్చించారు. రెండు బృందాలుగా ఢిల్లీ వెళ్లాలని సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు నిర్ణయించారు.ఈ నెల 19,20 తేదీల్లో ఆంటోని కమిటీకి తమ వాదనలు వినిపించాలని తీర్మానించారు. సమైక్య రాష్ట్రం మినహా మరో ప్రత్యామ్నాయం లేదన్న నిర్ణయానికి వారొచ్చారు.
సీమాంధ్ర కేంద్ర మంత్రులు రాజీనామా చేస్తే కేంద్రంపై ఒత్తిడి పెరుగుతుందని వారు ఒక అభిప్రాయానికి వచ్చారు. రాజీనామా దిశగా సీమాంధ్ర కేంద్ర మంత్రుల్ని ఒప్పించాలని నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటు సమావేశాల తర్వాత ఆంటోని కమిటీని సీమాంధ్రలో పర్యటించాలని కోరనున్నట్లు వారు తెలియజేశారు.