: ఆన్ లైన్ గాసిప్స్ పై స్పందించిన జయసుధ


కాస్త సెలబ్రిటీ హోదా వస్తే చాలు గాసిప్స్ కాచుకుని ఉంటాయి. ముఖ్యంగా సినీ స్టార్లకు ఈ విషయంగా బాగా తెలుసు. గ్లామర్ ప్రపంచంలో నిత్యం వారు ఎంతో మందిని కలవడంతో పాటు, సహనటీనటులతో సన్నిహితంగా మెలగాల్సి ఉంటుంది. దాంతో సహజంగానే పుకార్లు వెల్లువెత్తుతాయి. ఈ విషయమై సీనియర్ నటీమణి, ఎమ్మెల్యే జయసుధ తన అభిప్రాయాలు పంచుకున్నారు. ఆన్ లైన్ గాసిప్స్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. హైదరాబాదులో ఓ సినీ వెబ్ సైట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జయసుధ మాట్లాడుతూ, గాసిప్స్ రాసేటప్పుడు వ్యక్తుల వ్యక్తిగత జీవితాలనూ పరిగణనలోకి తీసుకోవాలన్నారు. కొన్ని పుకార్లు చదివేందుకు బాగానే ఉంటాయని, అయితే, అవి శృతిమించితే ప్రమాదమని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News