: తమిళనాడు ముఖ్యమంత్రిని కలవనున్న మోడీ


గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ దేశం మొత్తం కలియతిరుగుతున్నారు. పర్యటనల్లో ప్రథమార్థం మొత్తం దక్షిణ భారత దేశం మీద దృష్టి సారించారు. ఉత్తరాదిలో పార్టీ కేడర్ ను పెంచుకున్న బీజేపీకి దక్షిణాది రాష్ట్రాల్లో పెద్దగా ప్రాతినిధ్యం లేదు. దీంతో కేవలం కర్ణాటక రాష్ట్రానికే ఆ పార్టీ పరిమితమైంది. కమ్యూనిస్టుల కంచుకోటైన కేరళలో ప్రస్థానం ప్రారంభించని బీజేపీ, తెలంగాణకు మద్దతు ప్రకటించి ఆంధ్రప్రదేశ్ లో భవిష్యత్తుపై ఆశలు పెట్టుకుంది. ఇప్పుడు తమిళనాడు వైపు దృష్టి సారించింది. సినీ జనానికి, రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరైన తమిళనాడులో పాగా వేయాలని నిశ్చయించుకున్నారు. సెప్టెంబర్ లో కోయంబత్తూరులో నిర్వహించనున్న ర్యాలీ లో మోడీ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితతో ఆయన భేటీ కానున్నారు. అనంతరం తిరుచిరాపల్లిలో పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ చేస్తారని బీజేపీ జాతీయ కార్యదర్శి, తమిళనాడు ఇన్చార్జి మురళీధరరావు తెలిపారు.

  • Loading...

More Telugu News