: విద్యుత్ సౌధలో విభజన చిచ్చు


విద్యుత్ సౌధలో ఉద్యోగుల మధ్య విభజన చిచ్చు రగులుకుంటోంది. విద్యుత్ సౌధలో తెలంగాణ ఉద్యోగులకోన్యాయం, సీమాంధ్ర నేతకో న్యాయం అమలవుతోంది. మొన్న భోజన విరామ సమయంలో నిరసన చేస్తున్న సీమాంధ్ర ఉద్యోగులకు బాసటగా పయ్యావుల, తులసి రెడ్డిలు వచ్చినప్పుడు తెలంగాణ ఉద్యోగులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసి నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. అప్పుడు పోలీసులు రంగప్రవేశం చేసి నేతలను వెనక్కి పంపి ఉద్యోగులను శాంతింపజేశారు. తాజాగా తెలంగాణ జన జాగృతి అధ్యక్షురాలు కవిత సహా ఇతర తెలంగాణ ఉద్యోగులు సీఎండీకి వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న పోలీసులు విద్యుత్ సౌధకు చేరుకుని వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారికి పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో తెలంగాణ ఉద్యోగులు, కవిత విద్యుత్ సౌధ కార్యాలయం ఎదుట బైఠాయించారు.

  • Loading...

More Telugu News