: వైఎస్సార్సీపీ కార్యకర్తలే నాపై దాడి చేశారు: వీహెచ్


తిరుపతిలో అలిపిరి గేట్ వద్ద తనపై జరిగిన దాడి పట్ల రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు హైదరాబాదులో మీడియాతో మాట్లాడారు. తాను అలిపిరి వద్దకు చేరుకోగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గులాబీ పూలు ఇచ్చేందుకు వచ్చారని, అదే సమయంలో వెనుకనుంచి వైఎస్సార్సీపీ కార్యకర్తలు దాడికి ఉపక్రమించారని ఆయన వెల్లడించారు. రెచ్చగొట్టేలా వ్యవహరించొద్దని, అన్నదమ్ముల్లా కలిసుందామని ఆయన సూచించారు. తెలంగాణ ఉద్యమం ఇప్పటిది కాదని, 60 ఏళ్ళ నాటిదని చెప్పుకొచ్చారు. అసలు తెలంగాణ ఉద్యమానికి కార్యాచరణ రూపొందించిందే రాయలసీమ నేతలని వీహెచ్ చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News