: షెడ్యూల్ ప్రకారమే ఎంసెట్ కౌన్సెలింగ్
షెడ్యూల్ ప్రకారమే ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహించాలని ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. సీమాంధ్రలో ఎంసెట్ కౌన్సెలింగ్ కు ఆటంకం ఏర్పడే అవకాశం ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆయన సూచించారు. మరోవైపు కౌన్సెలింగ్ లో పాల్గొనే అభ్యర్థులకు ధ్రువపత్రాలు జారీ కాలేదు. రెవెన్యూ ఉద్యోగులు తామేమీ చేయలేమని చేతులెత్తేస్తున్నారు. విధులకు హాజరుకావాలంటే నేతలు తక్షణం రాష్ట్ర విభజన ప్రకటనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అలా కాని పక్షంలో తాము చేసేది న్యాయసమ్మతమేనని, దానికి అడ్డంకులు సృష్టించవద్దని ఉద్యోగులు కోరుతున్నారు.