: షూటింగులో గాయపడ్డ కమల్ హాసన్.. ఆసుపత్రికి తరలింపు
విలక్షణ నటుడు కమల్ హాసన్ విశ్వరూపం-2 చిత్ర షూటింగ్ సందర్భంగా గాయపడ్డారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం తమిళనాడులోని కొడైకెనాల్ వద్ద జరుగుతోంది. ఆయనపై యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తుండగా, ప్రమాదవశాత్తూ గాయాలపాలయ్యారు. దీంతో, షూటింగ్ నిలిపివేసి ఆయనను హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. కాగా, గాయాల తీవ్రత స్వల్పమేనని తెలుస్తోంది. విశ్వరూపం సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.