: మోడీని విమర్శిస్తే ఆరేళ్లపాటు బహిష్కరణే: ఆర్ఎస్ఎస్
బీజేపీ ప్రధాని అభ్యర్థి, ఆ పార్టీ ప్రచారక్ ను తమ పార్టీకి చెందిన నేతలెవరైనా విమర్శిస్తే సహించేది లేదని ఆర్ఎస్ఎస్ నేత సురేష్ సోనీ హెచ్చరించారు. లక్నోలో ఆయన మాట్లాడుతూ ప్రధాని పదవికి మోడీనే సరైన వ్యక్తని అందరూ భావిస్తున్నారని అన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఆయనపై పార్టీలోని వ్యక్తులు విమర్శలకు దిగితే తీవ్ర నష్టం కలుగుతుందని, అందుకే క్రమశిక్షణా ఉల్లంఘనను సహించేది లేదని సోనీ స్పష్టం చేశారు. మోడీని ఎవరైనా విమర్శించినా, లేదా పార్టీ నాయకత్వ నిర్ణయాన్ని ప్రశ్నించినా ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరిస్తామని ఆయన తెలిపారు. దేశ భవిష్యత్తు మార్చడానికి మోడీ ప్రధాని కావాల్సి ఉందని, అందుకు బీజేపీ శ్రేణులన్నీ కలిసి శక్తివంచన లేకుండా కృషి చేయాలని సోనీ పిలుపునిచ్చారు.