: బెజవాడ బంద్.. ఉమ దీక్షా వేదిక గుంటూరుకు..?
టీడీపీ మైలవరం ఎమ్మెల్యే దేవినేని ఉమ అరెస్టుకు నిరసనగా బెజవాడ బంద్ కు టీడీపీ పిలుపునిచ్చింది. దీంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు పాతబస్తీలోని దుకాణాలను మూసివేయిస్తున్నారు. ఆమరణ దీక్షా శిబిరాన్ని దేవినేని ఉమ మరో చోటికి మార్చే యోచనలో ఉన్నారు. దీనిపై టీడీపీ అధినేతతో చర్చలు జరుపుతున్నారు. దీంతో దీక్ష వేదికను గుంటూరుకు మార్చే ఆలోచనలో టీడీపీ నేతలు ఉన్నారు. దేవినేని ఉమ ప్రస్తుతానికి మాచవరం పోలీస్ స్టేషన్లో ఉన్నారు.