: వైజాగ్ లో సమైక్యాంధ్ర కోసం కదంతొక్కిన జర్నలిస్టులు
సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా జర్నలిస్టులు విశాఖలో కదంతొక్కారు. గురజాడ విగ్రహం నుంచి భారీ ర్యాలీ నిర్వహించి జగదాంబ సెంటర్లో మానవహారంగా ఏర్పడ్డారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు తమ స్వప్రయోజనాల కోసం సీమాంధ్రుల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో సోనియా కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారని నినాదాలు చేశారు. రాష్ట్రాన్ని విభజిస్తే సహించేది లేదని, విభజన మాటెత్తితే కాంగ్రెస్ పార్టీకి సమాధికడతామని వారు నినదించారు. విభజన నిర్ణయాన్ని ఉపసంహరించుకోకుంటే ఉద్యమాన్ని మరింత తీవ్రం చేస్తామని జర్నలిస్టులు హెచ్చరించారు.