: 'అత్తారింటికి..' సినిమాను అడ్డుకోవద్దంటూ రేపు ఫ్యాన్స్ ర్యాలీ


'అత్తారింటికి దారేది' సినిమా విడుదల జాప్యం కావడం పట్ల పవన్ కల్యాణ్ అభిమానులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రాష్ట్ర విభజన ప్రకటన తదనంతర పరిణామాలే సినిమా విడుదల వాయిదాకు కారణమని భావిస్తున్న అభిమానులు రేపు కాకినాడలో భారీ ర్యాలీ జరిపేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా మెగా ఫ్యామిలీ సినిమాలను అడ్డుకుంటామని హెచ్చరించిన పార్టీలకు, జేఏసీలకు వారు విజ్ఞప్తి చేశారు. పవన్ సినిమా విడుదలకు మార్గం సుగమం చేయాలంటూ కోరారు. ఈ క్రమంలో రేపు ఉదయం 8 గంటలకు కాకినాడ భానుగుడి జంక్షన్ నుంచి ఈ ర్యాలీ ప్రారంభం కానుంది.

  • Loading...

More Telugu News