: బాసరలో దోపిడీ దొంగల బీభత్సం
బాసరలోని శారదానగర్ కాలనీలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఆదిలాబాద్ జిల్లా బాసరలోని జ్ఞాన సరస్వతీదేవి ఆలయం ఎదుట కొబ్బరికాయల వ్యాపారం చేస్తున్న మణికంఠ ఇంట్లో దుండగులు చొరబడి నలుగురిని హత్య చేశారు. దుండగుల దాడిలో గాయపడిన మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.