: మరింత పెరగనున్న మొబైల్ కాల్ చార్జీలు
ఇప్పటికే మొబైల్ చార్జీలు సామాన్యులకు భారంగా మారాయి. అయినా, కంపెనీల లాభాల దాహానికి పరిమితి ఉండదు కదా! అందుకే కాల్ ధరలను మరింతగా పెంచాలని యోచిస్తున్నాయి. కాల్ ధరలను 15 శాతం వరకూ పెంచాలని కొందరు ఆపరేటర్లు యోచిస్తున్నారు. అతిపెద్ద టెలికాం కంపెనీకి చెందిన అధికారి మాట్లాడుతూ.. కాల్ ధరలను నిమిషానికి 10 పైసల వరకూ పెంచాలని అనుకుంటున్నట్లు చెప్పారు. దేశీయంగా ప్రస్తుతం కాల్ ధరలు నిమిషానికి సగటున 60 నుంచి 70 పైసల వరకు ఉన్నాయి.