: ఆపిల్‌పైనా ఈ ప్రభావం పడుతోంది
భూతాపం రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఈ ప్రభావం అటు హిమ గిరులపైనే కాకుండా ఇటు సముద్రంపై కూడా ప్రభావం చూపుతుండగా ఇప్పుడు ఆపిల్‌పై కూడా భూతాపం తన ప్రభావాన్ని చూపిస్తున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. భూతాపం ప్రభావం కారణంగా ఆపిల్ పంట దిగుబడి తగ్గుతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ విషయాన్ని గురించి శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జపాన్‌కు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్రూట్ ట్రీ సైన్స్‌కు చెందిన శాస్త్రవేత్తలు నిర్వహించిన తాజా అధ్యయనంలో భూతాపం కారణంగా ఆపిల్ పళ్ల దిగుబడి తగ్గిపోతున్నట్టుగా గుర్తించారు. ఈ విషయం గురించి శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తూ పండ్ల దిగుబడి తగ్గుతున్నా వాటిలోని తియ్యదనం మాత్రం పెరుగుతోందని చెబుతున్నారు. శాస్త్రవేత్తలు 1970 నుండి 2010 మధ్య కాలంలో జపాన్‌లోని రెండు ఆపిల్ తోటల నుండి సమాచారాన్ని సేకరించారు. వాతావరణ మార్పుల కారణంగా వాటిలో వచ్చిన మార్పులను వీరు పరిశీలించారు. వీరి పరిశీలనలో పంట దిగుబడి తగ్గడమే కాకుండా, ఫలసాయం చేతికి రావడానికి గతంలో కంటే ఎక్కువ సమయం పడుతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనికి భూతాపం కారణమని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.