: ప్రారంభమైన లాల్ జాన్ బాషా అంతిమయాత్ర
టీడీపీ సీనియర్ నేత లాల్ జాన్ బాషా అంతిమయాత్ర కొద్దిసేపటి క్రితం గుంటూరులో ప్రారంభమైంది. ఇక్కడి బీఆర్ స్టేడియం నుంచి అంతిమయాత్ర మొదలైంది. పట్టణంలో వర్షం కురుస్తున్నా బాషా అభిమానులు, టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో ఈ అంతిమయాత్రలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఇతర నేతలే కాకుండా, అన్ని పార్టీల నుంచి ఆయన సన్నిహితులు కడసారి నివాళులర్పించారు.