: ప్రధాని పర్యటన.. అడుగడుగునా ఆంక్షలు


ప్రధాని మన్మోహన్ సింగ్ బేగంపేట విమానాశ్రయంలో దిగడం దగ్గర నుండి  పేలుళ్ళ  ప్రాంతాలకు చేరుకునే వరకూ పోలీసు విభాగం పటిష్ఠ భ్రదతా చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా విమానాశ్రయం నుంచి ప్రధాని నేరుగా ప్రత్యేక హెలికాప్టర్లో సరూర్ నగర్లోని విక్టోరియా స్మారక గృహానికి బయలుదేరి వెళ్లారు.

రక్షణ చర్యలలో భాగంగా పోలీసు విభాగం మూడు హెలికాప్టర్లను ఉపయోగించి మన్మోహన్ ఎందులో ఉన్నారనే విషయం తెలియకుండా రహస్యంగా ఉంచింది. ప్రధాని పర్యటనను కవర్ చేసేందుకు మీడియా ప్రతినిధులకు  కూడా గట్టి ఆంక్షలు విధించారు.

తమను అనుమతించాలని విలేకరులు పోలీసు అధికారులను కోరినా పట్టించుకోలేదు. ఈ పర్యటనకు ఐ అండ్ పీఆర్ విభాగం పాస్ లు ఇచ్చినా పోలీసులు మీడియాను అనుమతించకపోవడం గమనార్హం.

  • Loading...

More Telugu News