: ఈ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు: సుదర్శన్ రెడ్డి
తెలంగాణ బిల్లును ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశ పెడతారని మంత్రి సుదర్శన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ లో ఆయన మీడియాలో మాట్లాడుతూ సీమాంధ్ర ప్రజలు ఎలాంటి అభద్రత భావానికి లోనవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. విడిపోతున్న ప్రస్తుత తరుణంలో సీమాంధ్ర నేతలు అనవసర రాద్ధాంతం చేయడం సరికాదని హితవు పలికారు.