: రూపాయి పతనంతో కేంద్రం అత్యవసర సమావేశం


ఎన్ని చర్యలు తీసుకున్నా డాలర్ తో రూపాయి మారకం విలువ క్షీణత ఆగకపోవడంతో ప్రధానమంత్రి కార్యాలయం అత్యవసర సమావేశం నిర్వహించనుంది. దీనికి ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు హాజరు కానున్నారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ రోజు డాలర్ తో రూపాయి మారకం విలువ చారిత్రక కనిష్ఠ స్థాయి 62కు పడిపోయింది. ఈ ప్రభావంతో స్టాక్ మార్కెట్లు కూడా భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

వాస్తవానికి రూపాయి విలువ క్షీణతకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంది. అయినా, ఎప్పటికప్పుడు విలువ మరింతగా పడిపోతూనే ఉండడంతో ప్రభుత్వంలో ఆందోళన పెరిగిపోతోంది. చివరికి బుధవారం దేశం నుంచి విదేశీ నిధులు తరలిపోకుండా ప్రభుత్వం ఆంక్షలు కూడా విధించింది. కానీ ఇవేవీ రూపాయిని కాపాడలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థికరంగంలో నెలకొన్న సమస్యలపై ప్రధానమంత్రి కార్యాలయం అధికారులు తాజా సమావేశంలో చర్చించనున్నారని తెలుస్తోంది. రానున్న రోజులలో ప్రభుత్వం నుంచి మరిన్ని చర్యలు వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News