: చిరు లేకపోతే పవన్ లేడంటున్న నాగేంద్రబాబు


చిరంజీవికి తెలంగాణ ఉద్యమం, సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్ర మనోవేదనను మిగిల్చాయి. ఈ ఉద్యమాలు ఆయన అభిమానులే అతని తీరును తప్పుపట్టే పరిస్థితి కల్పించాయి. దీంతో అభిమానుల్లో చాలా మంది ఆయనపై బాహాటంగానే వ్యతిరేకత వ్యక్తం చేశారు. వీరంతా అతని తమ్ముడి వైపుకి మరలారని సినీ వర్గాల ఉవాచ. దీంతో చిరు ప్రాభవం మసకబారిపోతోంది. అభిమానులే రాజీనామాకు డిమాండ్ చేస్తున్నారు. అతనికి విజయాన్ని చేకూర్చిన తిరుపతి ప్రజలైతే అగ్గిమీద గుగ్గిలమైపోతున్నారు. వస్తే.. ఉద్యమ తీరు రుచిచూస్తాడని చిరంజీవికి చిన్న సైజు వార్నింగిచ్చేస్తున్నారు.

మరోవైపు పవన్ కల్యాణ్ ఇమేజి మేరుపర్వతమంత ఎత్తుకు ఎదిగిపోతోంది. అభిమానులు పవన్ మానియాలో కొట్టుకుపోతున్నారు. పవన్ పేరుంటేనే చాలు సినిమాలు హిట్టైపోతున్నాయి. దీనికి తోడు పవన్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ చిరంజీవిని అస్సలు పట్టించుకోవడం లేదట.. దీంతో ఈ పరిస్థితికి ముగింపు పలికాలని భావించిన నాగబాబు ప్యాచప్ చేయడం మొదలుపెట్టాడు. అందులో భాగంగానే తాజాగా చిరు లేకపోతే పవన్ లేడంటూ స్టేట్ మెంటిచ్చాడని సినీజనాలు అనుకుంటున్నారు.

ఈమధ్య ఓ గేమ్ షోలో యాంకర్ సుమ.. 'అన్నయ్య అంటే ఇష్టమా? తమ్ముడంటే ఇష్టమా? అని ప్రశ్నించింది. నాగబాబు దీనికి జవాబిస్తూ 'ఓ 24 ఏళ్ల కుర్రాడు కట్టుబట్టలతో చెన్నై వెళ్లి స్వయంకృషితో మెగాస్టార్ గా ఎదిగి ఓ పార్టీ పెట్టి ఏడాది తిరక్కుండా కేంద్ర మంత్రిగా నిలవడం మామూలు విషయం కాదు. అలాంటిదాన్ని సుసాధ్యం చేసిన ఏకైక వ్యక్తి చిరంజీవిగారు. అలాంటి వ్యక్తి నాకు అన్నయ్య అంటే గర్వమే కదా.. అన్నయ్యే లేకపోతే కల్యాణ్ కానీ, చరణ్ కానీ, బన్నీ కానీ, నేను కానీ లేము' అని సెలవిచ్చాడు. పనిలో పనిగా తమ్ముడికి సాటి లేరని తమ్ముడి వ్యక్తిత్వం తిరుగలేనిదని కూడా చెప్పాడు. ఇదంతా ఎందుకంటే, వీరి మధ్య పెరుగుతున్న అగాధాన్ని పూడ్చే ప్రయత్నమని టాలీవుడ్ అనుకుంటోంది.

  • Loading...

More Telugu News