: మూసీలో దొరికిన చిన్నారి మాన్వి మృతదేహం


తండ్రి చేతిలో నుంచి మూసీ నదిలో జారిపడిన చిన్నారి మాన్వి మృతదేహం కొద్దిసేపటి క్రితం బయటపడింది. రంగారెడ్డి జిల్లా హయత్ నగరం మండలం, మర్రిపల్లి వంతెన వద్ద మాన్వి మృతదేహాన్ని గుర్తించారు.

లండన్ లో వైద్యుడిగా పనిచేస్తున్న ప్రమోద్ కుమార్ రెడ్డి సెలవుల్లో భాగంగా హైదరాబాద్ కు వచ్చారు. ఎల్బీనగర్ లోని సహారా ఎస్టేట్ లో విడిది చేశారు. నిన్న నాగోల్ వద్ద మూసీ నది సందర్శనకు వెళ్లినప్పుడు ఫొటోలు తీసే క్రమంలో చిన్నారి మాన్వీ ప్రమోద్ కుమార్ రెడ్డి భుజంపై నుంచి నదిలోకి పడిపోయింది. ఎంత వెతికినా నిన్న చిన్నారి జాడ కనిపించలేదు.

ఈ ఉదయం ట్యాంక్ బండ్ వద్ద విధులు నిర్వహించే గజ ఈతగాళ్లతో మూసీ నదిలో నాగోల్ నుంచి దిగువకు 15 కిలోమీటర్ల పరిధిలో గాలింపు చర్యలు చేపట్టారు. జాతీయ విపత్తుల నివారణ సంస్థ బృందం కూడా రంగంలోకి దిగింది. దీంతో ఎట్టకేలకు చిన్నారి మృతదేహం బయటపడింది. సెలవులలో సంతోషంగా గడిపి మళ్లీ ఈ నెల 26న లండన్ కు వెళ్లాల్సిన వైద్యుడు ప్రమోద్ కుమార్ రెడ్డి ఇంట పెద్ద ఎత్తున విషాదం నెలకొంది.

  • Loading...

More Telugu News