: ఆంటోనీ కమిటీ ఎదుటకు సీమాంధ్ర కేంద్ర మంత్రులు
రాష్ట్ర విభజన ప్రకటన అనంతరం ఏవైనా అభ్యంతరాలుంటే ఈ కమిటీకి చెప్పుకోండని కాంగ్రెస్ అధిష్ఠానం ఆంటోనీ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీని నిన్న తెలంగాణ ప్రాంత నేతలు కలవగా నేడు సీమాంధ్ర కేంద్ర మంత్రులు కలవనున్నారు. ఈ సాయంత్రం ఢిల్లీలో చిరంజీవి నివాసంలో భేటీ అయిన సీమాంధ్ర కేంద్ర మంత్రులు ఆంటోనీ కమిటీ ఎదుట ఏం మాట్లాడాలన్న దానిపై రిహార్సల్స్ చేశారు. ఉన్నపళంగా రాష్ట్రాన్ని విభజించవద్దని ఆంటోనీ కమిటీతో చెప్పాలని వారు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.