: విజయమ్మకు మద్దతిస్తాం: ఏపీఎన్జీవో


రాష్ట్ర విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ చేపడుతున్న దీక్షకు తాము మద్దతిస్తున్నట్టు ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. ఈ సాయంత్రం హైదరాబాదులో విజయమ్మతో భేటీ అయిన ఏపీఎన్జీవో నేతలు ఆమెతో పలు విషయాలపై చర్చించారు. భేటీ అనంతరం అశోక్ బాబు మీడియాతో మాట్లాడుతూ, మూడు ప్రాంతాలకు సమన్యాయం జరగాలన్నది విజయమ్మ అభిమతమని చెప్పారు. అలా చేయలేకుంటే రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలని ఆమె కోరుతున్నారని, ఈ క్రమంలోనే ఆమె దీక్ష చేపడుతున్నారని తెలిపారు. అందుకే ఆమెకు మద్దతిస్తున్నట్టు స్పష్టం చేశారు. సమైక్యాంధ్ర కోసం ఏ పార్టీ పోరాటం సాగించినా మద్దతిస్తామని చెప్పారు. సమైక్యాంధ్ర కోసం తాము చేస్తున్న ఉద్యమానికి వైఎస్సార్సీపీ మద్దతిస్తుందని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News