: గుంటూరుకు లాల్ జాన్ బాషా మృతదేహం
ఉదయం రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన టీడీపీ నేత లాల్ జాన్ బాషా మృతదేహాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో కొద్ది సేపు ఉంచి నివాళులు అర్పించిన అనంతరం అక్కడి నుంచి ఆయన స్వస్థలం గుంటూరుకు తరలిస్తున్నారు. అంత్యక్రియలు రేపు మధ్యాహ్నం ఆయన స్వస్థలం గుంటూరులో జరుగుతాయి. కాగా, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఆయన పార్థివదేహంపై పార్టీ జెండా కప్పిన చంద్రబాబు తన సహచరుడికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా 'లాల్ జాన్ బాషా అమర్ రహే', 'లాల్ జాన్ బాషా అమర్ హై' అనే నినాదాలతో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ మార్మోగిపోయింది. ఆయనను చివరిసారిగా దర్శించుకునేందుకు పెద్ధ ఎత్తున కార్యకర్తలు, అభిమానులు ట్రస్ట్ భవన్ వద్దకు చేరుకున్నారు.