: సింధుపై సైనా విజయభేరి
రసవత్తరపోరుగా భారత బ్యాడ్మింటన్ వర్గాలు అభివర్ణించిన మ్యాచ్ ముగిసింది. ఐబీఎల్ లో భాగంగా ఈ సాయంత్రం ఢిల్లీలో స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, పీవీ సింధుల మధ్య పోరు జరిగింది. ఈ ఏకపక్ష పోరులో సైనా 21-19, 21-8తో సింధును చిత్తు చేసింది. తొలి గేమ్ లో పోరాట పటిమ కనబర్చిన సింధు రెండో గేమ్ లో సైనా జోరుకు చేతులెత్తేసింది. సైనా హైదరాబాద్ హాట్ షాట్స్ కు ప్రాతినిధ్యం వహిస్తుండగా.. సింధు లక్నో అవధ్ వారియర్స్ తరుపున ఆడుతోంది.